ఇబ్రహీంపట్నం : వారానికి ఒకసారి సహజయోగులందరూ కలిసి సాముహిక ధ్యానం చేయడం ద్వారా మరింత ఉన్నతి పొందొచ్చునని సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్‌ కల్లూరి రామకృష్ణ అన్నారు. హెచ్‌హెచ్‌ శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల 4నుంచి 10వ తేదీ వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో జరగనున్న సహజయోగ చైతన్య ప్రచార రథ యాత్ర తెలంగాణా రాష్ట్రం నుంచి ఎన్‌టిఆర్‌ జిల్లాలోని కంచికచర్ల మీదుగా మూలపాడు నుంచి ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పిల్లల్లో  మంచి నడవడికకు,  జ్ఞాపక శక్తి పెంపుకు , మానసిక ఒత్తిడి జయించటానికి, సృజనాత్మకత మెరుగుకు సహజయోగ ధ్యానం ఉపకరిస్తుందన్నారు. యువతకు సహజయోగ ధ్యాన సాధన వల్ల యువతకు స్థిర చిత్తం లభిస్తుందన్నారు. వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయన్నారు. బాధ్యతయుతమైన వ్యక్తులుగా తయారవుతారన్నారు. చెడ్డ కోరికలు, దురహంకారం మాయమవుతాయన్నారు. ప్రతి చిన్న విషయానికి అతిగా ప్రతిస్పందించకుండా వివేకంతో మెలుగుతారన్నారు. తప్పులను తమపై వేసుకుని అపరాధ భావన భావనతో ఉండరన్నారు. వయోజనులు అహంకార,ప్రత్యహంకారాలను అధిగమించి, ఆత్మను గుర్తించి, శుద్ధ  విద్యతో సంతఅప్తి గా భగవంతునికి  శ రణాగతులై, ఎవరినుండి ఏది ఆశించకుండా ధర్మ బద్ధ జీవన విధానం అవలంభిస్తారన్నారు. విశ్వ మానవాళి రక్షింబడడానికి సహజయోగమనే మహాయోగాన్ని అందరూ నేర్చుకుని సత్‌ చిత్‌ ఆనందాన్ని అందసహజయోగ ధ్యానాన్ని ప్రతిరోజూ ఆచరించటం కుండలినీ జాగృతి అవ్వడంతో ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చునని వివరించారు. సహజయోగ ట్రస్ట్‌ మహిళా విభాగం కోఆర్డినేటర్‌ సుగ్గుల సుధారాణి, ఎన్‌ఎస్‌పిటి దక్షిణాది రాష్ట్రాలు (ఆంధ్రా, తెలంగాణా, తమిళనాడు, కేరళ) కన్వీనర్‌ కె.సుభాషిణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 దేశాల్లో సహజయోగాన్ని ప్రజలు ఆచరిస్తున్నారని వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్టినేని వెంకట్రావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కోఆర్డినేటర్‌ యర్రంశెట్టి  గాంధీ, భీమవరం జిల్లా కోఆర్డినేటర్‌ సిహెచ్‌.మణి, కృష్ణాజిల్లా ప్రచార కమిటీ కన్వీనర్‌ ఎస్‌.శంకర్‌, కోకన్వీనర్‌ డి.జయశంకర్‌, విజయవాడ నగర కోఆర్డినేటర్‌ టి.రవీంద్రబాబు బృందంలో ఉన్నారు. కె.సౌజన్య, వై.రాజీ, వై.లక్ష్మి, కల్పన, డి.వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *