మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
పినపాకలో రూ.56.65 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.
ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ పట్టిందని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.జి.కొండూరు మండలం పినపాక గ్రామంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన గావించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.18.25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు.రూ.18.40 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 8 మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ.2.3లక్షలు వెచ్చించారు.ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పి.ఎం.ఏ.జె.వై) నిధులు రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గంలో రూ.25 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి వర్యులు నరేంద్రమోడీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.ఎన్డీఏ కూటమి సర్కారు అధికారం చేపట్టిన వెంటనే గుంతల రోడ్ల మరమ్మతులు చేపట్టిందన్నారు. కాగా కొన్ని రహదారులు పునఃనిర్మించాల్సి ఉందన్నారు. ఇందుకు గానూ రూ.2000 కోట్లతో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు గారు పీ4 విధానంతో ఆర్థిక అసమానతలు తగ్గించి,పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు.ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని మలచడంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారన్నారు. అమరావతి నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు, రైతులకు ఉపాధి-ఆదాయం లభించనుందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గ్రామస్తుల నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.